27 నుంచి చిరుధాన్యాల ప్రదర్శన | Telangana agricultural program on february 27 | Sakshi
Sakshi News home page

27 నుంచి చిరుధాన్యాల ప్రదర్శన

Feb 25 2015 1:21 AM | Updated on Jun 4 2019 5:04 PM

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు ‘తెలంగాణ చిరుధాన్యాల ప్రదర్శన-2015’ నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ కమిషనర్ ప్రియదర్శిని, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌రావులు వెల్లడించారు.

 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు ‘తెలంగాణ చిరుధాన్యాల ప్రదర్శన-2015’  నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ కమిషనర్ ప్రియదర్శిని, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌రావులు వెల్లడించారు.

మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. జొన్న, రాగి, సజ్జ, కొర్ర, వరిగ, సామ తదితర చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని ఇందులో వివరిస్తారని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement