12 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు | telangan junior colleges to have pongal holidays from 12th to 18th | Sakshi
Sakshi News home page

12 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు

Jan 7 2015 8:03 PM | Updated on Sep 2 2017 7:21 PM

తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవుల్లో మార్పు జరిగింది.

తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవుల్లో మార్పు జరిగింది. ఇంతకుముందు కేవలం పండుగ మూడు రోజులు మాత్రమే సెలవులు ఉంటాయని చెప్పినా.. మళ్లీ ఇప్పుడు మార్చి వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈనెల 12వ తేదీ సోమవారం నుంచి 18వ తేదీ ఆదివారం వరకు సంక్రాంతి సందర్భంగా సెలవులు ప్రకటించారు.

దీంతో ముందు ఆదివారంతో కలుపుకొంటే మొత్తం 8 రోజుల పాటు జూనియర్ కళాశాలల విద్యార్థులకు సెలవులు వచ్చినట్లయింది. అయితే, కొన్ని కార్పొరేట్ కళాశాలలు మాత్రం ముందుగానే ఆ వారం రోజులకు సంబంధించి ప్రాజెక్టు వర్కులు కూడా ఇచ్చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement