
మార్మోగిన మానుకోట
మానుకోటను జిల్లాగా మార్చాలంటూ ఎనిమిది రాజకీయ పార్టీలు మానుకోట జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో...
మహబూబాబాద్ : మానుకోటను జిల్లాగా మార్చాలంటూ ఎనిమిది రాజకీయ పార్టీలు మానుకోట జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన భారీ బైక్ ర్యాలీతో పట్టణం మార్మోగింది. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. జిల్లా సాధన కోసం నేడు(బుధవారం) చేపట్టే బంద్‌ను విజయవంతం చేయూలని అఖిలపక్ష నాయకులు కోరారు. నాయకులు దేవరం ప్రకాశ్‌రెడ్డి, భూపతి మల్లయ్య, బి.అజయ్, యాప సీతయ్య, కొత్తపల్లి రవి, లింగ్యానాయక్, దార్ల శివరాజ్, జిల్లా సాధన కమిటీ చైర్మన్ డోలి సత్యనారాయణ , పిల్లి సుధాకర్, పొన్నాల యుగేంధర్, మూలగుండ్ల వెంకన్న, కొండపల్లి రాంచందర్‌రావు, దర్శనం రామకృష్ణ, ఇనుగుర్తి సుధాకర్, తప్పెట్ల వీరన్న, పూనెం మురళి, ధర్మారపు కనకయ్య, కామ సంజీవరావు, గుంజె హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
బంద్‌కు గిరిజన జాక్ మద్దతు
న్యూశాయంపేట : మానుకోట బంద్‌కు గిరిజన సంఘాల రాజకీయ జేఏసీ వరంగల్ జిల్లా స్టీరింగ్ కమిటీ తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు స్టీరింగ్ కమిటీ సభ్యులు బానోతు నవీన్‌నాయక్, జువారి రమేష్ నాయక్ ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.