టీఆర్‌టీ నియామకాలు చేపట్టాలి | Teachers Protest In Khammam | Sakshi
Sakshi News home page

టీఆర్‌టీ నియామకాలు చేపట్టాలి

Jun 12 2019 8:17 AM | Updated on Jun 12 2019 8:17 AM

Teachers Protest In Khammam - Sakshi

అధికారికి వినతిపత్రం అందజేస్తున్న సంఘం నాయకులు 

ఖమ్మంసహకారనగర్‌: టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌మెం ట్‌టెస్ట్‌ (టీఆర్‌టీ) నియామకాలు వెంటనే చేపట్టా లని టీపీటీఎఫ్‌ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వి.మనోహర్‌రాజు డిమాండ్‌ చేశారు. మంగళవారం నగరంలోని టీపీటీఎఫ్‌ తలపెట్టిన నిరసన ర్యాలీ సంఘం కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మనో హర్‌రాజు మాట్లాడుతూ నిరుద్యోగ విద్యావంతులైన యువకులు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయ ని ఆశించారని, అవి అమలుకు నోచుకోవటం లేదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నాగిరెడ్డి మా ట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమంలో పోరాటం చేసిన యువత ప్రస్తుతం నిరాశ నిస్పృహలతో ఉన్నారన్నారు.

ఉద్యమాలు చేయకముం దే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులకు సంవత్సర నుంచి ఇవ్వాల్సిన కరవుభత్యం (డీఏ) ఈ నెలలో ప్రకటించారని, ఈ సంవత్సరం ఇవ్వాల్సిన డీఏ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పీఆర్‌సీ వెంటనే కొత్త స్కేల్‌ను ప్రకటించాలన్నారు. కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మద్దతు పలికారు. అనంతరం కలెక్టరేట్‌ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు విజయ్, నర్సింహారావు, ప్రసాదరావు, నాగేశ్వరరావు, నాగిరెడ్డి, ఉమాదేవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement