సంప్రదాయాలను భావితరాలకు అందించాలి

Tamili Sai Attends Telugu Sangam Sankranti Third Composition At Hyderabad - Sakshi

గవర్నర్‌లు దత్తాత్రేయ, తమిళిసై సౌందరరాజన్‌ 

మణికొండ: మన పండుగలు, సంస్కృతి, తెలుగుభాష, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలోని ఓం కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న తెలుగు సంగమం సంక్రాంతి మూడవ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దత్తాత్రేయ, తమిళిసై ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో సినీ నటుడు కృష్ణంరాజు దంపతులు, సినీగేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top