స్వామివారిని దర్శించుకున్న తలసాని

Talasani Srinivas Yadav Visits Tirumala Temple - Sakshi

సాక్షి, తిరుమల: సినీ ఇండస్ట్రీ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలవడం మంచి పరిణామమని, అందులో తప్పేమీ లేదని తెలంగాణ పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారం ఆయన తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో కూడా సీఎం జగన్‌ రైతులు, ప్రజలకు మంచి పాలన అందిస్తారని ఆశిస్తున్నానన్నారు. ప్రతిపక్షాలు విమర్శించినా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు వెళుతుందని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చారని, ప్రతిపక్షాలు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్నారు. కాగా చంద్రబాబునాయుడు ఎన్నికలు జరిగిన 20 రోజుల నుంచే ప్రతిరోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని తలసాని విమర్శించారు. ఇక మూడు రాజధానుల అంశంపై స్పందిస్తూ అది ఏపీకి సంబంధించిన విషయమని దాటవేశారు. (సీఎంను కలిసిన టాలీవుడ్‌ నిర్మాతలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top