వివేకానందున్ని ఆదర్శంగా తీసుకోవాలి | Take the example of Vivekananda | Sakshi
Sakshi News home page

వివేకానందున్ని ఆదర్శంగా తీసుకోవాలి

Mar 25 2017 6:39 PM | Updated on Aug 17 2018 2:56 PM

యువత స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఎంఈవో రవీందర్‌ సూచించారు.

లక్సెట్టిపేట: యువత స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఎంఈవో రవీందర్‌ సూచించారు. మండల కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉండడంతో పాటు ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జై హన్మాన్‌ యూత్‌ అధ్యక్షుడు తగరపు సత్తయ్య, నాయకులు ప్రవీణ్, రవిజోసెఫ్, స్వామి, రాజ్‌కుమార్, సురేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement