'కేసీఆర్ గాల్లో తేలియాడుతున్నారు' | T Jeevan reddy takes on cm kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ గాల్లో తేలియాడుతున్నారు'

Apr 18 2015 3:31 PM | Updated on Aug 15 2018 9:27 PM

'కేసీఆర్ గాల్లో తేలియాడుతున్నారు' - Sakshi

'కేసీఆర్ గాల్లో తేలియాడుతున్నారు'

రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను విస్మరించి సీఎం కేసీఆర్ గాల్లో తేలియాడుతున్నారని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు.

హైదరాబాద్: రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను విస్మరించి సీఎం కేసీఆర్ గాల్లో తేలియాడుతున్నారని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. కరువు, అకాల వర్షాలకు తెలంగాణలో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన అన్నారు. శనివారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... పంట నష్టం జరిగిన పండ్ల తోటలకు ఎకరాకు రూ. 50 వేలు, ఇతర పంటకు ఎకరాకు రూ. 20 వేలు చెల్లించాలని ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు మండలాలను తక్షణమే ప్రకటించాలని కేసీఆర్కు జీవన్రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement