మెదక్ డీసీసీ అధ్యక్షురాలిగా సునీతా లక్ష్మారెడ్డి | sunitha lakshmareddy appointed as Medak dcc president | Sakshi
Sakshi News home page

మెదక్ డీసీసీ అధ్యక్షురాలిగా సునీతా లక్ష్మారెడ్డి

Oct 10 2014 2:15 PM | Updated on Mar 18 2019 9:02 PM

మెదక్ డీసీసీ అధ్యక్షురాలిగా సునీతా లక్ష్మారెడ్డి - Sakshi

మెదక్ డీసీసీ అధ్యక్షురాలిగా సునీతా లక్ష్మారెడ్డి

మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు.

హైదరాబాద్ : మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నుంచి శుక్రవారం ఆమె నియామక పత్రం అందుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాలతో తెలంగాణ పీసీసీ ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ సూచన మేరకు తెలంగాణ పీసీసీ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గాంధీభవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి హాజరు అయ్యారు.ఇటీవల జరిగిన మెదక్ ఉప ఎన్నికలో సునీతా లక్ష్మారెడ్డి పరాజయం పొందిన విషయం తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement