
బాలురా.. కార్మికులా..
బడి బయట పనిలో ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాల బాట పట్టించాల్సినవారే.. పిల్లలతో పనులు చేయిస్తున్నారు.
బడి బయట పనిలో ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాల బాట పట్టించాల్సినవారే.. పిల్లలతో పనులు చేయిస్తున్నారు. పుస్తకాల బరువులు మోయిస్తున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూనలకు కృషి చేయాల్సిన ఉపాధ్యాయులే పిల్లలతో పనిచేయిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శనివారం ఎంఈవో బలిరాం రాథోడ్ పాఠశాలలవారీగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. వాటిని ప్రధానోపాధ్యాయులు తీసుకెళ్లి విద్యార్థులకు అందించాల్సి ఉంది. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలనుంచి విద్యార్థులను తీసుకువచ్చి పుస్తకాలను మోయించారు. ఎంఈవో సాక్షిగానే ఇదంతా జరగడం గమనార్హం. - నిజాంసాగర్