స్కాలర్‌షిప్ గడువు పెంచాలని ధర్నా | students dharna due to scholarship | Sakshi
Sakshi News home page

స్కాలర్‌షిప్ గడువు పెంచాలని ధర్నా

Oct 30 2015 11:40 AM | Updated on Sep 3 2017 11:44 AM

ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే గడువు మరింత పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

రెబ్బెన: ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే గడువు మరింత పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లాలో నేటితో స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు ముగుస్తోంది. అయితే, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందక చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు.

దీనిపై శుక్రవారం తెలంగాణ విద్యార్థి విభాగం(టీవీవీ) ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. దరఖాస్తు గడువు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీవీవీ జిల్లా అధ్యక్షుడు సాయి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement