ఫీజులపై విద్యార్థుల ఆందోళన | students concerns on fees | Sakshi
Sakshi News home page

ఫీజులపై విద్యార్థుల ఆందోళన

Dec 21 2014 2:26 AM | Updated on Oct 2 2018 8:08 PM

ఫీజులపై విద్యార్థుల ఆందోళన - Sakshi

ఫీజులపై విద్యార్థుల ఆందోళన

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను క్యాంపస్ బాలుర వసతి గృహం ఎదుట దహనం చేశారు.

తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఫీజు రీయింబర్‌‌సమెంట్, స్కాలర్ షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీలో ఏబీవీపీ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. దిష్టి బొమ్మ దహనం, ధర్నా చేశారు.
 
తెయూ(డిచ్‌పల్లి): ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను క్యాంపస్ బాలుర వసతి గృహం ఎదుట దహనం చేశారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడుస్తున్నా, విద్యార్థుల సమస్యలపై స్పం దించక పోవడం భాదాకరమన్నారు.

స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయక పోవడం వల్ల ప్రైవేటు విద్యా సంస్థల యాజామాన్యాలు విద్యార్థులకు ధ్రువీ కరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి  చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుల సంఘాలు, మత సంస్థల మీద ఉన్న ఉన్న ప్రేమ విద్యార్థుల మీద లేదని విమర్శించారు.
 ఇప్పటికైనా విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే పీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో తె యూ ఏబీవీపీ ఇన్‌చార్జి రమణ, విద్యార్థి నాయకులు తిరుపతి, అనిల్, సురేశ్, మోహన్, ప్రవీణ్, చరణ్, వెంకటేశ్, ప్రపుల్ తదితరులు పాల్గొన్నారు.
 
పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా
తెయూ(డిచ్‌పల్లి) : పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌లను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. శనివారం క్యాంపస్ బాలుర వసతి గృహం ఎదుట పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలి పారు. ఈ సందర్భం గా తెయూ పీడీఎస్‌యూ అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే స్కాలర్‌షిప్‌లు, ఇతర సౌకర్యాలు పెరుగుతాయని ఆశిం చిన విద్యార్థులకు ప్రభుత్వ వైఖరి తీవ్ర నిరాశను మిగిల్చిందని అన్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చే యాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.నిరసన కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు అజ య్, గజానంద్, శివ, స్టాలిన్, సునీల్, రఘు, స్వామి, నరేశ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement