సారూ.. ఇదేం తీరు..?

Students Cleaning Clases  - Sakshi

విద్యార్థులతో పాచి పని

ఉపాధ్యాయుల ఇష్టారాజ్యం

ఆగ్రహించిన గ్రామస్తులు

మద్నూర్‌(జుక్కల్‌) : విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు బాల కార్మికులుగా మారుస్తున్నాడు. దేశ నిర్ధేశకుడిగా తీర్చిదిద్దాల్సింది పోయి తరగతి గదులను శుభ్రం చేయించిన సంఘటన మద్నూర్‌ మండలం మేనూర్‌ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. మండలం లోని మేనూర్‌ గ్రామంలో గల ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న హెచ్‌ఎం అంజయ్య గురువారం విద్యార్థులతో తరగతి గదులను శుభ్రం చేయించి కడిగించాడు.

పాఠశాలకు ప్రహారి లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఆరు, ఏడు తరగతుల గదుల వద్ద బురద, మట్టి వేశారు. అయితే గదుల ను నీటితో కడిగి శుభ్రం చేయాలని హెచ్‌ఎం అం జయ్య ఆరో తరగతికి చెందిన భజరంగ్, రోహి దాస్, మందన్‌ను ఆదేశించాడు. హెచ్‌ఎం చెప్పిం దే తడవుగా విద్యార్థులు నీటిని తీసుకువచ్చి చీపురుతో ఆరు, ఏడు తరగతులను కడిగేశారు. ఇది గమనించిన ‘సాక్షి’ ఫోటోలు తీయడాన్ని చూసిన విద్యార్థులు తరగతి గదిలోకి పారిపోయారు.

వి ద్యార్థులతో పాచి పనులు చేయించడం ఏమిటని ప్రశ్నించగా విద్యార్థుల ఇష్టంతోనే పనులు చేస్తున్నారని సదరు హెచ్‌ఎం చెప్పుకొచ్చాడు. విష యం తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రయోజకులుగా తయారు చేస్తాడని అనుకుంటే పనులు చేయించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఉన్నత పాఠశాలకు హెచ్‌ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న అంజయ్య ఉపాధ్యాయులను, విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాల్సింది పోయి తనే క్రమశిక్షణ తప్పుతున్నాడని పలువురు అంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top