ఆటోలోంచి జారిపడి విద్యార్థిని మృతి | student died in an accident | Sakshi
Sakshi News home page

ఆటోలోంచి జారిపడి విద్యార్థిని మృతి

Feb 13 2015 8:15 PM | Updated on Mar 9 2019 4:28 PM

పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న విద్యార్థిని ఆటోలోంచి జారిపడి మృతిచెందింది.

అదిలాబాద్: పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న విద్యార్థిని ఆటోలోంచి జారిపడి మృతిచెందింది. అదిలాబాద్ జిల్లా కేరామేరి మండలంలోని నవోదయ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న హర్షిత ప్రతిరోజు ఆటోలో పాఠశాలకు వెళ్లివస్తోంది. రోజు మాదిరిగానే శుక్రవారం పాఠశాలకు వచ్చి వెళ్తున్న బాలిక ప్రమాదవశాత్తు ఆటోలోంచి జారిపడి మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థిని బంధువులు పాఠశాలలోని సామగ్రికి నిప్పంటించారు. పిల్లలను తీసుకువె ళ్లడానికి స్కూల్‌బస్సు ఏర్పాటు చేస్తామని తమ వద్ద నుంచి డబ్బులు తీసుకున్న పాఠశాల యజమాన్యం ఇప్పుడు పిల్లలను ఆటోలో తీసుకెళ్లడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలో 25 మంది విద్యార్థులు ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యేక్షసాక్షులు చెప్తున్నారు.

(కేరామేరి)
 

Advertisement
 
Advertisement
Advertisement