హెచ్‌సీయూలో విషాద చాయలు | student died in hyderabad central university | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూలో విషాద చాయలు

Oct 13 2017 1:14 PM | Updated on Nov 9 2018 4:36 PM

 student died in hyderabad central university - Sakshi

సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనిర్సిటీలో ఓ విద్యార్థి మృతి చెందాడు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆకాష్‌ గుప్తా హెచ్‌సీయూలో ఎంఏ సోషియాలజీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి గురువారం సాయంత్రం చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి నీటి గంటలో పడ్డాడు. ఆకాష్‌కు ఈత రాకపోవడంతో నీట మునిగిపోయాడు.

వెంటనే అప్రమత్తమైన స్నేహితులు అతన్ని బయటకు తీసి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆకాష్‌ తల్లిదండ్రులు జార్ఖండ్‌లో ఉంటున్నారు. ఆకాష్‌ గుప్తా మృతితో వర్సిటీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement