ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలికపై పది కుక్కలు మూకుమ్మడిగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి.
హైదరాబాద్: ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలికపై పది కుక్కలు మూకుమ్మడిగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. వివరాల్లోకి వెళితే... కర్మన్‌ఘాట్ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీలో నివాసముండే వెంకటేష్, కళ దంపతుల కూతురు స్వాతి (6) స్థానికంగా ఉన్న ఆల్ఫా పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది.
గురువారం ఇంటి ముందు స్వాతి ఆడుకుంటుండగా అటుగా వచ్చిన పది కుక్కలు దాడిచేసి తల, శరీరంలోని పలు చోట్ల గాయపరిచాయి. తీవ్రంగా గాయపడిన స్వాతిని ఆస్పత్రికి తరలించారు.