
మధుకర్‌రెడ్డి తలలో దిగిన కర్ర
అశ్వాపురం: ఓ బాలుడు మిత్రులతో సరదాగా ఆడుకుంటూ చింతకాయల కోసం చెట్టుకు కర్రలు విసురుతుండగా ప్రమాదవశాత్తూ తలలో గుచ్చుకున్న ఘటన అశ్వాపురం మండలం రామచంద్రాపురంలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గూడూరు మధుకర్‌రెడ్డి(10) పాఠశాల నుంచి గురువారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. తోటి మిత్రులతో కలిసి ఆడుకుంటూ చింతచెట్టు వద్దకు వెళ్లాడు. స్నేహితుడు వెనుక నుంచి కర్ర విసరగా, మధుకర్ తల కింది భాగంలోకి దిగింది. చిన్న మెదడుకు సమీపంలో గుచ్చుకోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. బాలుడు స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు.