ఖరీఫ్‌కు ఎస్సారెస్పీ నీరు

SRSP Water To Be Released Karimnagar - Sakshi

ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు నిజంగా ఇది శుభవార్త. ఎగువ నుంచి భారీగా వరద నీరు ఎస్సారెస్పీలోకి చేరుతుండటంతో ఈ ఖరీఫ్‌కు పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జలసౌధలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాఠిల్‌లతో కలిసి ఈఎన్సీ మురళీధర్, ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే, ఇరిగేషన్‌ ప్రత్యేకాధికారి కే.ప్రసాద్, అడినిస్ట్రేటీవ్, కమ్‌ చీఫ్‌ ఇంజినీరు బి.శంకర్‌లతో సమీక్ష నిర్వహించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి లోయర్‌ మానేర్‌ డ్యామ్‌ (ఎల్‌ఎండీ)కు నీటి విడుదల, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఈ ప్రాజెక్టు కింది ఆయకట్టు 4.60 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. నీటి విడుదల ప్రణాళికలను సిద్ధం చేయాలని ఎస్సారెస్పీ అధికారులను మంత్రి హరీశ్‌ ఆదేశించారు. దీంతో ఆయకట్టుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఇటీవలి వర్షాలతో ఎల్‌ఎండీ ఎగువ, దిగువన ఉన్న, ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటి విడుదలకు అవకాశం కలిగింది. ఎగువ నుంచి ఎస్సారెస్పీలోకి వరద ఉధృతి పెరిగింది. రెండు రోజులుగా రోజుకు 2.66 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వారం రోజుల కిందటి వరకు ఎస్సారెస్పీ 19 టీఎంసీల కు పరిమితం కాగా సోమవారం రాత్రి నాటికి 56 టీఎంసీలకు చేరినట్లు అధికారులు తెలి పారు. మొత్తం 90 టీఎంసీల నీటి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు ఇదే రకంగా వరద ఉధృతి కొనసాగితే బుధవారం  నాటికి ఎస్సారెస్పీ పూర్తిగా నిండుతుందని అధికారవర్గాలు ‘సాక్షి’కి వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌ జలసౌధలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సాగునీటి విడుదలకు ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

దీంతో ఎల్‌ఎండీ ఎగువన నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, నిర్మల్‌ జిల్లాల పరిధిలోని 4 లక్షల 62 వేల 920 ఎకరాల ఆయకట్టుకు 32 టీఎంసీల సాగునీరు అందనుం ది. ఎల్‌ఎండీ దిగువన ఉన్న కరీంనగర్, వరంగల్‌రూరల్, వరంగల్‌ అర్బన్, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల పరిధిలోని 2,05,720 ఎకరా ల ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది. గత రబీలోనూ ఇదే ప్రణాళికను రూపొందించిన ఎస్సారెస్పీ అధికారులు ఆ¯న్, ఆఫ్‌ పద్ధతిలో 8 రోజుల ఆన్, 7 రోజుల ఆఫ్‌ విధానం ద్వారా నీటి విడుదల చేశారు. తిరిగి ఈ ఖరీఫ్‌లోనూ ఎస్సారెస్పీ పూర్తి ఆయకట్టుకు నీరిందించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంపై ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
టెల్‌ టూ హెడ్, ఆన్‌ అండ్‌ ఆఫ్‌..

నీటి వృథాను అరికట్టేందుకు టెల్‌ టూ హెడ్, ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిన నీటి విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు సి ద్ధం చేస్తున్నారు. గత రబీలో ఈ పద్ధతి అమలు చేయ డం ద్వారా ఒక్క టీఎంసీ నీటితో 13 వేల నుంచి 14 వేల ఎకరాలకు నీరు ఇవ్వగలిగామన్న అంచనాలో వా రున్నారు. ఇదే అంశంపై సమావేశం మంత్రి హరీశ్‌రావు నీటి విడుదలకు ఇవే మార్గదర్శకాలను సూచించి నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు రైతులు సై తం ఈ పద్ధతితో ఎక్కువ దిగుబడి సాధించామని ఆనందం వ్యక్తం చేశారని కూడా అంటున్నారు. దీంతో ఈ ఖరీఫ్‌లో నీటిని టెల్‌ టూ హెడ్, ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో వినియోగించేలా పకడ్బందీ చర్యలకు అధి కార యంత్రాంగం సిద్ధమవుతోంది.

క్షేత్ర స్థాయిలో ఇంజినీర్లు రైతులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో  సమావేశాలు ఏర్పాటు చేసి.. నీటి విడుదల ప్ర ణాళికలు వివరించేందుకు కసరత్తు చేస్తున్నారు. కాలు వ పరిధిలో రైతులకు నీటి విడుదల సమాచారం అం దించేలా ఇంజినీర్లు, రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో టాం టాంలు వేయించే ఆలోచనలో ఉన్నారు.గతేడాది వర్షాలతో ప్రాజెక్టులు నిండగా, వర్షపు నీరు సముద్రం పాలుకాకుండా చెరువులు, కుంటల్లో నీరు నింపిన వి షయం తెలిసిందే. ఎల్‌ఎండీకి ఎగువ, దిగువన ఉన్న కాలువల ద్వారా జీవీసీ 1 పరిధిలోని 258, జీవీసీ4 పరిధిలోని 439, వరంగల్‌ (సీసీహెచ్‌) 154, స్టేజీ2 పరధిలో 270 చెరువు కుంటలను నింపారు. ఈ ఏడా ది కూడా చివరి ఆయకట్టు నీరివ్వడంతోపాటు ఎక్కడైనా నీరు చేరకుండా ఉంటే.. భవిష్యత్‌లో ఆ చెరువులు, కుంటలనూ నింపే యోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. 

రెండు రోజుల్లో ఫుల్‌.. 
నాలుగైదు రోజులుగా ఎస్సారెస్సీలోకి భారీగా వరద చేరుతోంది. ఎగువ నుంచి రోజుకు 2.66 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. 90 టీఎంసీల సా మర్థ్యం గల ఈ ప్రాజెక్టులోకి సో మవారం రాత్రి 7 గంటల వరకు 56 టీఎంసీలు వచ్చాయి. ఈ లెక్కన రెండు రో జుల్లో ప్రాజెక్టు నిండుతుంది. ఖరీఫ్, రబీ పంట లకు ఈసారి కూడా ఢోకాలేదు. నీటి విడుదల కోసం ప్రభుత్వం, మంత్రి హరీశ్‌రావు నీటి విడుదల ప్రణాళికల తయారీకి ఆదేశాలు ఇచ్చారు.  – బి.శంకర్, ఏసీఈ, ఎస్సారెస్పీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top