ప్రాంతీయ సెంటిమెంట్లకు ఛాంపియన్లమని పేరుతెచ్చుకునే క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు ఇష్టానుసారంగా ప్రకటనలు గుప్పిస్తున్నారని కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
హైదరాబాద్: ప్రాంతీయ సెంటిమెంట్లకు ఛాంపియన్లమని పేరుతెచ్చుకునే క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు ఇష్టానుసారంగా ప్రకటనలు గుప్పిస్తున్నారని మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
శుక్రవారం గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఇద్దరు సీఎంల మధ్య ఆధిపత్యపోరు జరుగుతున్నదని, ఇది ఇరు రాష్ట్రాలకూ చేటు చేస్తుందన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన నిధుల కోసం టీపీసీసీ పోరాడుతుందని స్పష్టం చేశారు.