నయనానందంగా శ్రీరామ రథోత్సవం | Sri Rama nayanand Chariot | Sakshi
Sakshi News home page

నయనానందంగా శ్రీరామ రథోత్సవం

Apr 11 2014 6:10 AM | Updated on Sep 2 2017 5:54 AM

జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామ దివ్య రథోత్సవాన్ని నయనానందపర్వంగా నిర్వహించారు.

నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామ దివ్య రథోత్సవాన్ని నయనానందపర్వంగా నిర్వహించారు. ముందుగా సముద్రాల యాదగిరాచార్య, శఠగోపాలాచార్య, సంపత్‌కుమారాచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిం చారు.

 

భక్తాంజనేయస్వామి భజన మండలి ఆధ్వర్యంలో భజ న, దుర్గా భవాని మహిళా మండలి గోదా కోలాట బృందాలు, పాలబిందెల బాలు నృత్యాలు, పెంటయ్య బ్యాండు భక్తి గీతాలాపనలతో రథోత్సవం పురవీధుల్లో సాగింది. ఈ సందర్భంగా అడుగడుగునా భక్తులు హారతులతో నీరజనాలు పలికారు.  కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, ఈఓ మనోహర్‌రెడ్డి, టుటౌన్ ఎస్‌ఐ బాషా, కమిటీ సభ్యులు జడల సువర్ణ, సునీతవేమన, శ్రీనివాసాచార్యులు, భక్తులు చకిలం వేణుగోపాలరావు, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement