తెలంగాణ జైళ్లశాఖకు కొత్త లోగో | Spicy jaillasakha new logo | Sakshi
Sakshi News home page

తెలంగాణ జైళ్లశాఖకు కొత్త లోగో

Dec 12 2014 2:29 AM | Updated on Sep 2 2017 6:00 PM

తెలంగాణ జైళ్లశాఖకు కొత్త లోగోను ప్రభుత్వం ఆమోదించింది. ఉమ్మడిరాష్ట్రంలో ఉన్న జైళ్లశాఖ లోగోలో మార్పులు చేస్తూ కొత్త లోగోను రూపొందిం చారు.

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జైళ్లశాఖకు కొత్త లోగోను ప్రభుత్వం ఆమోదించింది.  ఉమ్మడిరాష్ట్రంలో  ఉన్న జైళ్లశాఖ లోగోలో  మార్పులు  చేస్తూ కొత్త లోగోను రూపొందిం చారు. ఇందుకు కళాకారుల సాయం తీసుకున్నారు. ప్రస్తుత లోగోను నీలంరంగు బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లని అక్షరాలలో  తెలంగాణ స్టేట్ అని పైన, దాని క్రింద ప్రిజన్స్ అని రాశారు. లోగో పైన జాతీయ చిహ్నం సింహం గుర్తును బంగారు రంగులో  ఏర్పాటు చేశారు. అలాగే లోగోలో  కస్టడీ విత్ ఫెయిర్ అనే నినాదాన్ని  చేర్చారు. ఈ లోగోకు ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆమోదముద్ర వేయడంతో  ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement