కరోనాపై పోరుకు విరాళాల వెల్లువ

Special Story About Donations For Coronavirus To CM Relief Fund - Sakshi

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల కోసం పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో పాటు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలను ప్రకటిస్తున్నాయి.
► రాష్ట్ర ఐపీఎస్‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో తమ ఒకరోజు వేతనాన్ని సీఎం సహాయనిధికి విరాళంగా అందజేసింది. ఈ మేరకు ఆదివారం డీజీపీ మహేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు చెక్కును అందజేశారు. 
► అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.3 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు ప్రకటించారు. 
► ముఖ్యమంత్రి సహాయనిధికి తెలంగాణ రిటైర్డ్‌ కాలేజీ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ రూ. 1 కోటి విరాళం ప్రకటించింది. తమ పెన్షన్‌ల నుంచి ‘ఒకరోజు పెన్షన్‌’ను మినహాయించాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌కు అసోసియేషన్‌ సభ్యులు సూచించారు.   
► తెలంగాణ విద్యా వలంటీర్ల సంఘం.. రా ష్ట్ర వ్యాప్తంగా గల 15,681 మంది వలంటీర్ల ఒక రోజు వేతనం కింద రూ.62,72,400 సీ ఎం సహాయ నిధికి విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు చెక్కును ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు అందచేశారు.

ప్రధాని సహాయ నిధి పేరుతో నకిలీ ఖాతాలు
సాక్షి,హైదరాబాద్‌: కరోనా ఒకపక్క వణికి స్తోంటే, మరోవైపు సైబర్‌ నేరగాళ్లు వినూత్న మోసాలకు దిగుతున్నారు. ప్రధానమంత్రి సహాయనిధికి పలువురు పౌరులు స్వచ్ఛం దంగా విరాళాలు ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే అదనుగా పలువురు నకిలీ ఖాతాలు సృ ష్టించి, స్వాహా చేస్తున్నారని తెలంగాణ పోలీ సులు హెచ్చరిస్తున్నారు. పీఎం సహాయనిధి కి విరాళాలిచ్చేవారు అన్ని వివరాలు తనిఖీ చేసుకోవాలని సూచించారు. ‘పీఎం కేర్స్‌’ పే రిట ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఖా తాలో అక్షరాలను మార్చి, అమాయకులను ఏమారుస్తున్నారని పోలీసులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top