ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఆదేశాలు

Special Busses For Inter Exams 2020 Says Sabitha Indra Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలను కలుపుకుని పరీక్షలను విజయవంతం చేయాలన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు. అనంతరం పరీక్షల సమయంలో విద్యుత్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రశ్నాపత్రాలు పోలీస్‌ స్టేషన్‌ నుంచి తీసుకురావాలన్నారు. కలెక్టర్లు జిల్లా స్థాయి కమిటీ చైర్మన్లుగా బాధ్యతతో వ్యవహరించాలని తెలిపారు. ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి, పారదర్శక రీతిలో సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఇక విద్యార్థుల ఇంటర్‌ పరీక్షల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులు పరీక్షలపై శ్రద్ధ వహించాలన్నారు. (చక్రం తిప్పిన సబితమ్మ : అనూహ్యంగా యువనేతకు పట్టం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top