
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నుంచి వ్యవసాయ శాఖకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెడతామని వ్యవ సాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో ‘తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సమా వేశానికి అచ్చంపేట, షాద్‌నగర్ శాసన సభ్యులు గువ్వల బాలరాజు, అంజయ్య, మార్క్‌ఫెడ్ చైర్మన్ బాపురెడ్డి, ఎస్సీ కార్పొ రేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ప్రజాకవి గోరటి వెంకన్న, అసోసియేషన్ వ్యవ స్థాపక అధ్యక్షులు కె.రాములు హాజర య్యారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఉద్యోగుల కోరికలను ఈ బడ్జెట్‌లో పొందుపరు స్తామన్నారు. ప్రజాకవి గోరటి వెంకన్న మాట్లాడుతూ దేశంలో అసమానతలతో సామాన్య ప్రజలు కష్టాలు పడుతున్నా రన్నారు. సమాజంలోని అక్రమాలపై ఆయన పాటలు పాడుతూ ఉద్యోగులను చైతన్యపరిచారు. వ్యవస్థాపక అధ్యక్షులు కె.రాములు మాట్లాడుతూ తమ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి పోచారాన్ని కోరారు.