సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘దర్జాగా ఇసుక దందా’ కథనంపై జిల్లా ఎస్పీ సుమతి స్పందించారు...
- పోలీస్ నిఘా వర్గాల ద్వారా వివరాల సేకరణ
- రవాణా వాహనాల సీజ్‌కు ఆదేశం
మెదక్ టౌన్: సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘దర్జాగా ఇసుక దందా’ కథనంపై జిల్లా ఎస్పీ సుమతి స్పందించారు. జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై వివరాల సేకరణకు పోలీస్ నిఘా వర్గాలను ఆయా గ్రామాలకు పం పించినట్లు సమాచారం. పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లికి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వెళ్లి అక్కడ నిల్వ చేసిన ఇసుక డంప్‌లను ఫొటోలు తీసి వివరాలు సేకరిం చారు. దందాకు పాల్పడే వారి వివరాలు గ్రామస్తుల ద్వా రా తెలుసుకొంటున్నారు.
ఇసుక అక్రమ రవా ణా చేసే వాహనాలను అక్కడికక్కడే సీజ్ చేయాలని పోలీసులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేసినట్లు తె లిసింది. మరోవైపు.. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేం దర్‌రెడ్డి గ్రామానికి వచ్చి కూర్చున్నా.. ఒక్క ఇసుక ట్రాక్టర్‌ను ఇక్కడి నుంచి వెళ్లనివ్వబోమని రామాయంపేట మండలం కె.వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి ఫోన్ ద్వారా ‘సాక్షి’కి తెలిపారు. ‘సాక్షి’లో వచ్చిన కథనంతో ప్రజల్లో చైతన్యం వస్తోందన్నారు.