కొడుకు చోరీలు..తల్లి విక్రయాలు.. | son stolen items then mother sells them | Sakshi
Sakshi News home page

కొడుకు చోరీలు..తల్లి విక్రయాలు..

Apr 28 2015 11:48 PM | Updated on Sep 4 2018 5:16 PM

కొడుకు చోరీలు చేస్తుంటే మందలించాల్సిన తల్లి.. కొడుకు ఎత్తుకొచ్చిన దొంగసొత్తును గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తోంది.

హైదరాబాద్ : కొడుకు చోరీలు చేస్తుంటే మందలించాల్సిన తల్లి.. కొడుకు ఎత్తుకొచ్చిన దొంగసొత్తును గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తోంది. ఆ మహిళను సంతోష్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి గ్యాస్, వాషింగ్ మిషీన్, నాలుగు ఎల్‌సీడీలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మోయిన్‌బాగ్ ఫతేషానగర్ ప్రాంతానికి చెందిన షాహీదా బేగం (55), ఉస్మాన్ ఖాన్ దంపతులకు హబీబ్ ముస్తాఫా (30) సంతానం. ముస్తాఫా గత నాలుగైదు నెలలుగా స్థానికంగా తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నాడు.

 

దొంగలించిన వస్తువులను తల్లి షాహీదా బేగం ద్వారా విక్రయిస్తున్నాడు. ఇదే క్రమంలో హబీబ్ ముస్తాఫా దొంగలించిన గ్యాస్, వాషింగ్ మిషీన్, నాలుగు ఎల్‌సీడీలను స్థానికులకు విక్రయిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాల విషయాన్ని బయటపెట్టింది. దీంతో ఆమె వద్దనున్న గ్యాస్, వాషింగ్ మిషీన్, నాలుగు ఎల్‌సీడీలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ముస్తాఫా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement