తండ్రిని హతమార్చిన తనయుడు | son kills father with Stone slab in mahaboobnagar | Sakshi
Sakshi News home page

తండ్రిని హతమార్చిన తనయుడు

Apr 3 2017 2:01 PM | Updated on Oct 8 2018 5:07 PM

భూమికి సంబంధించిన విషయంలో కన్న తండ్రినే హతమార్చాడు.

మహబూబ్‌నగర్‌: నారాయణపేటలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. భూమికి సంబంధించిన విషయంలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆవేశానికి గురైన కుమారుడు తండ్రిని బండరాయితో కొట్టి చంపాడు. రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చిత్రించేందుకు ప్రయత్నించాడు. తండ్రి శవాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి రోడ్డు పక్కన తుప్పల్లో పడేస్తుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు పోలీసులకు చిక్కాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితుడిని ‍అదుపులోకి తీసుకున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement