కొడుకుని చంపి.. తల్లిపై సామూహిక అత్యాచారం | son killed, mother gangraped in Rangareddy district | Sakshi
Sakshi News home page

కొడుకుని చంపి.. తల్లిపై సామూహిక అత్యాచారం

Aug 4 2014 6:46 PM | Updated on Sep 2 2018 4:37 PM

మూడేళ్ల కుమారుడిని హత్య చేసి తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దుండగులు అభంశుభం తెలియని మూడేళ్ల కుమారుడిని హత్య చేసి తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్లో ఈ దారుణం జరిగింది.

అత్యాచార సంఘటన ఆదివారం రాత్రి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే అది అటవీ ప్రాంతం కావడంతో్ ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో బాధితురాలికి వెంటనే చికిత్స అందించలేకపోయారు. ఆలస్యంగా ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలి వివరాలు పూర్తిగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement