ఏంటిది.. చచ్చిపోతే ఎవరు రెస్పాన్స్‌!

Social Media Memes On Sunny Weather Conditions In Telugu States - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చండ ప్రచండమైన భానుడి భగభగలతో దేశవ్యాప్తంగా జనం వడ గాల్పుల తాకిడికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫ్యాన్లు ఎన్ని తిరుగుతున్నా ఇళ్లల్లో వేడి భరించలేకుండా ఉన్నామని చెప్తున్నారు. ఉక్కపోతకు తోడు.. వేడిగాలుల నుంచి ఉపశమనం కోసం ఏసీ, కూలర్లను వినియోగించాలని ఉన్నా.. కరోనా భయంతో వాటికి దూరంగా ఉంటున్నామని వాపోతున్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో నగర వాసులు.. తమ వేడి బాధను సోషల్‌ మీడియాలో మీమ్స్‌ రూపంలో వెళ్లక్కుతున్నారు. ఈ నేపథ్యంలో వాటిల్లో ఒక మీమ్‌ నెటిజన్లకు ఆకట్టుకుంటోంది. ‘నువ్‌ సూర్యుడివా యముడివా.. అలా మండుతున్నావ్‌ ఏంటి.. నిన్న 45 డిగ్రీలు, ఇవాళ 46 డిగ్రీలు చచ్చిపోతే ఎవరు రెస్పాన్స్‌’అంటూ హాస్యనటుడు బ్రహ్మానందం ఫొటోతో ఉన్న మీమ్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 
(చదవండి: ఫీల్‌.. కూల్‌)

ఎండ తీవ్రత వివరాలు..
తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడి ఈరోజు మరింత ఎక్కువగా ఉంది. నిజామాబాద్‌ 43, మెదక్‌ 42, వరంగల్‌ 44, హైదరాబాద్‌ 42, కరీంనగర్‌ 44, రామగుండం 43, నల్గొండ 44, విజయవాడ 42, విశాఖ 34, తిరుపతి 41, రాజమండ్రి 41, ఒంగోలు 42, నెల్లూరు 42, కర్నూలు 41, అనంతపురం 41, కడప 42, ఏలూరు 42, విజయనగరం 36, శ్రీకాకుళం 36 డిగ్రీల చొప్పున శుక్రవారం  ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఉత్తర భారత్‌లోని చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారత్‌లోని ప్రధాన నగరాల్లో నేటి ఎండల తీవ్రతను పరిశీలిస్తే.. ఢిల్లీ 45, హైదరాబాద్ 42‌, అహ్మదాబాద్ 41‌, చెన్నై 38, పుణె 36, ముంబై 35, కోల్‌కత 34, బెంగుళూరు 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top