రోట్లో పాము.. నోట్లో చట్నీ..

రోట్లో పాము.. నోట్లో చట్నీ..


ఓ కుటుంబం ఆస్పత్రిలో..

ఖిల్లాఘనపురం: వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజీపేట.. గురువారం ఉదయం.. గొల్ల రాజ మ్మ అనే మహిళ చట్నీ కోసం టమాటాలు, మిరపకా యలు ఉడికించింది. చట్నీ నూరేందుకు ఇంట్లోని పెద్ద రోట్లో వాటిని పోసి రోకలితో గట్టిగా నూరింది. అయి తే, అప్పటికే అందులో ఓ పాము పడుకుని ఉంది. దాన్ని గమనించని రాజమ్మ రోకలి దెబ్బలేసింది. అంతే పాము ముక్కలుముక్కలైంది.. చట్నీలో మిక్సయిపోయింది. రాజమ్మతో పాటు ఆమె కుమార్తె కృష్ణవేణి, కుమారుడు అదే చట్నీతో భోజనం చేశారు. గొర్రెల మంద దగ్గర ఉన్న పెద్ద కుమారుడు సాయికి కూడా తీసుకెళ్లారు. కొంత అన్నం తిన్న తర్వాత సాయికి చట్నీలో పాము తోక ముక్క కనిపించింది. అతడు చట్నీని పరిశీలించగా టమాటాలతో పాటు పాము ముక్కలు కనిపించాయి. ఆందోళనకు గురైన కుటుంబం మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో చేరి చికిత్సలు పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top