ఆలేరు పోలీస్ స్టేషన్‌లో సిట్ విచారణ | SIT Enquiry about Vikaruddin Encounter at Aleru police station | Sakshi
Sakshi News home page

ఆలేరు పోలీస్ స్టేషన్‌లో సిట్ విచారణ

May 20 2015 5:15 PM | Updated on Nov 6 2018 4:42 PM

వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం ఏర్పాటైన సిట్ బృందం బుధవారం నల్లగొండ జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించింది.

ఆలేరు (నల్లగొండ) : వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం ఏర్పాటైన సిట్ బృందం బుధవారం నల్లగొండ జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించింది. అక్కడి సిబ్బంది నుంచి వివరాలు సేకరించింది. ఉదయం 7 గంటలకు వచ్చిన ఐదుగురు సభ్యుల విచారణ బృందం మధ్యాహ్నం 2.30 గంటల వరకు అక్కడే ఉంది. వికారుద్దీన్‌తోపాటు మరో నలుగురు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేసిన బస్సును ఆలేరు స్టేషన్‌లోనే ఉంచారు. ఆ బస్సును విచారణ అధికారులు పరిశీలించారు.

గత నెల 7న వికారుద్దీన్, మరో నలుగురు ఉగ్రవాదులను విచారణ కోసం వరంగల్ కేంద్ర కారాగారం నుంచి హైదరాబాద్ కోర్టుకు తీసుకువస్తుండగా... ఆలేరు సమీపంలోకి రాగానే వారు తప్పించుకునేందుకు యత్నించగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీనిపై ఆరోపణలు రావడంతో సీఎం కేసీఆర్ స్వయంగా సిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సిట్ బృందంలో సందీప్‌శాండిల్య (ఐజీ), రవికుమార్(ఐజీ), షానవాజ్ ఖాసిం (ఖమ్మం ఎస్పీ), రవీందర్ (హుమాయూన్ నగర్ సీఐ)తోపాటు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన రాధా వెంకట్‌రెడ్డి ఉన్నారు. వీరి వెంట భువనగిరి డీఎస్పీ మోహన్‌రెడ్డి కూడా ఆలేరు స్టేషన్‌కు వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement