
కుకునూర్‌పల్లికి శిరీష కుటుంబీకులు
బ్యూటీషియన్ శిరీష బాబాయితోపాటు మరికొంతమంది కుటుంబీకులను బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి కుకునూర్‌పల్లి పోలీసుస్టేషన్ వరకు పోలీసులు తీసుకువెళ్లారు.
సందేహాల నివృత్తి కోసం తీసుకెళ్లిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష బాబాయితోపాటు మరికొంతమంది కుటుంబీకులను బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి కుకునూర్‌పల్లి పోలీసుస్టేషన్ వరకు పోలీసులు తీసుకువెళ్లారు. శిరీషది ముమ్మాటికీ హత్యేనంటూ కుటుంబీకులు పలుమార్లు ఆరోపించడంతో పాటు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.
దీంతో శిరీష కుటుంబీకుల అనుమానాలను నివృత్తి చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. అధికారుల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు కుటుంబీకుల్ని పిలిపించి ఆ ఉదంతం పూర్వాపరాలను తెలిపారు. నగరం నుంచి కుకునూర్‌పల్లికి వెళ్లే మార్గంలో ప్రతి ప్రాంతంలో ఏం జరిగిందనే విషయాలను వివరించారు. కుకునూర్‌పల్లి పోలీసుక్వార్టర్స్‌లోని ఎస్సై గదికి తీసుకెళ్లి ఏం జరిగిందనే అంశాలను సైతం పూర్తిస్థాయిలో వారికి చెప్పారు.