సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం | SI Siddayya health condition critical, kamineni hospital doctors | Sakshi
Sakshi News home page

సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం

Apr 7 2015 2:13 PM | Updated on Aug 21 2018 7:34 PM

సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం - Sakshi

సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం

ఉగ్రవాదుల కాల్పులలో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కామినేని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

హైదరాబాద్:  ఉగ్రవాదుల కాల్పులలో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కామినేని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం కామినేని ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సిద్ధయ్యకు వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నట్లు వారు తెలిపారు.

శనివారం ఉగ్రవాదులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఆత్మకూరు (ఎం) ఎస్ఐ సిద్ధయ్య మెదడు, తల, ఛాతీ, పొట్టలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. దీంతో ఆయన్ని కామినేని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సిద్ధయ్యకు శస్త్ర చికిత్స నిర్వహించి... రెండు బులెట్లు తొలగించిన సంగతి తెలిసిందే.  
 

Advertisement
 
Advertisement
Advertisement