గొల్ల కుర్మల్ని ధనవంతుల్ని చేయడమే లక్ష్యం | Sheep Distribution Scheme In Sirisilla | Sakshi
Sakshi News home page

గొల్ల కుర్మల్ని ధనవంతుల్ని చేయడమే లక్ష్యం

Jul 2 2018 8:57 PM | Updated on Jul 2 2018 8:59 PM

Sheep Distribution Scheme In Sirisilla - Sakshi

సాక్షి, సిరిసిల్ల : పాడి-పంట బాగుంటేనే రైతు అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్స్‌లో రాష్ట్రస్థాయి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఇందులో భాగంగా లబ్దిదారులకు కేటీఆర్‌ 30 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు.

అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గతేడాది 60 లక్షల గొర్రెల పంపిణీ జరిగిందని, గొల్ల కుర్మలను ధనవంతులుగా మార్చాలనే ఉద్దేశంతోనే కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో  ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేసి మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేయబోతున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. గొర్రెలు రీసైక్లింగ్‌ చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలన్నారు.

యాభైఏళ్ల కాంగ్రెస్‌పాలనలో ఒరిగిందేమీ లేదు

యాభైఏళ్ల కాంగ్రెస్‌పాలనలో ఒరిగిందేమీ లేదని కేటీఆర్‌ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని, రానున్న రోజుల్లో తెలంగాణలో హరిత, నీలి, గులాబి, శ్వేత విప్లవాలు రాబోతున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 వేల చెరువులు నిండి నీలి విప్లవం రాబోతుందని​ కేటీఆర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement