చిట్యాలకు వెళ్లనున్న వైఎస్ షర్మిల | Sharmila visits lachamma family in Pentlapally, mahabubnagar district | Sakshi
Sakshi News home page

చిట్యాలకు వెళ్లనున్న వైఎస్ షర్మిల

Dec 10 2014 3:40 PM | Updated on Sep 2 2017 5:57 PM

చిట్యాలకు వెళ్లనున్న వైఎస్ షర్మిల

చిట్యాలకు వెళ్లనున్న వైఎస్ షర్మిల

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకస్మిక మరణం తట్టుకోలేక మృతి చెందిన పాలమూరు జిల్లా చిట్యాలలో మణమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు.

మహబూబ్నగర్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకస్మిక మరణం తట్టుకోలేక మృతి చెందిన పాలమూరు జిల్లా చిట్యాలలో మణెమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. కాసేపట్లో చిట్యాల చేరుకోనున్నారు. అనంతరం రాణిపేటలో దస్తగిరి కుటుంబం, నందిన్నెలో నరసింహరెడ్డి కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. అలాగే గోవర్థనగిరి, జమ్మిచేడు, గద్వాల్, ధరూర్లలోని మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు షర్మిల పూలమాల వేసి నివాళులర్పించనున్నారు.

 బుధవారం ఉదయం పెంట్లపల్లిలోని లచ్చమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అక్కడి నుంచి చిట్యాలకు బయల్దేరి వెళ్లారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా మృతి చెందడాన్ని తట్టుకోలేక చనిపోయిన బాధితుల కుటుంబాలను ఓదార్చేందుకే షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర సోమవారం (08-12-2014)  పాలమూరు జిల్లా కల్వకుర్తిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement