టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ యువనేతపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది.
కీసర (రంగారెడ్డి): తెలంగాణలో ఓ ప్రముఖ పార్టీకి చెందిన ఓ యువనేతపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన సంతోష్‌గౌడ్ (35) అనే వ్యక్తి లైంగికంగా వేధించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంతోష్ గౌడ్ తెలంగాణలోని ఓ ప్రముఖ పార్టీకి కీసర మండల యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.