టెన్త్‌ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ | Section 144 imposed at tenth exam centers | Sakshi
Sakshi News home page

టెన్త్‌ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌

Mar 7 2017 9:38 PM | Updated on Sep 5 2017 5:27 AM

ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ విధిస్తూన్నట్లు కొత్వాల్‌ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సిటీబ్యూరో: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఈ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ విధిస్తూన్నట్లు కొత్వాల్‌ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14 నుంచి 30 వరకు అమలులో ఉండే వీటి ప్రకారం ఆ ప్రాంతాల్లో నలుగురి కంటే ఎక్కువ మంది ఒక చోట గుమిగూడ కూడదు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి భవనాలకు రెండు కిమీ పరిధిలో నిషేధాజ్ఞలు విధించారు.
 
ఈ నెల 10 నుంచి 16 వరకు ఇవి అమలులో ఉంటాయని కొత్వాల్‌ తెలిపారు. తెలంగాణ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఉపాధ్యాయ నియోజకవర్గానికి గురువారం పోలింగ్‌ జరుగనుంది. దీంతో పోలింగ్‌ స్టేషన్ల వద్ద నిషేధాజ్ఞలు విధించారు. ఈ ఓటింగ్‌ కోసం పోలింగ్‌ కేంద్రాల వద్ద పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఓటరూ విధిగా క్యూలోనే రావాలని, ఒకరికి కేటాయించిన క్యూలోకి మరొకరిని అనుమతించమని పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement