అన్సారీ అంత్యక్రియలు పూర్తి | Gangster-politician Mukhtar Ansari laid to rest thousands attend funeral procession | Sakshi
Sakshi News home page

అన్సారీ అంత్యక్రియలు పూర్తి

Published Sun, Mar 31 2024 5:19 AM | Last Updated on Sun, Mar 31 2024 5:19 AM

Gangster-politician Mukhtar Ansari laid to rest thousands attend funeral procession - Sakshi

లక్నో: గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్‌ అన్సారీ అంత్యక్రియలు శనివారం యూపీలోని గాజీపూర్‌లో ముగిశాయి. వేలాది మంది అన్సారీకి మద్దతుగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

పట్టణంలో 144 సెక్షన్‌ అమలు చేశారు. కొందరు శ్మశాన వాటికలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. అన్సారీ సోదరుడు, ఎంపీ అఫ్జల్‌ అన్సారీ, ఘాజీపూర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ ఆర్యక అఖౌరీ మధ్య ఈ సందర్భంగా కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement