రెండోదశ పరిషత్‌ నామినేషన్లు షురూ | Second term Parishad Nominations are stated | Sakshi
Sakshi News home page

రెండోదశ పరిషత్‌ నామినేషన్లు షురూ

Apr 27 2019 5:56 AM | Updated on Apr 27 2019 5:56 AM

Second term Parishad Nominations are stated - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల దాఖలు పర్వం శుక్రవారం మొదలైంది. వచ్చే నెల 10న జరగనున్న రెండో విడత ఎన్నికల్లో 180 మండలాల్లోని 180 జెడ్పీటీసీ సీట్లకు, 1,913 ఎంపీటీసీ సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. దీనిలో భాగంగా తొలిరోజు ఎంపీటీసీ స్థానాలకు 2,682 మంది అభ్యర్థులు 2,765 నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్‌–1,292, కాంగ్రెస్‌–816, బీజేపీ–217, సీపీఎం–38, టీడీపీ–36, సీపీఐ–17, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద రిజిస్టర్‌ అయిన పార్టీలు–10, ఇండిపెండెంట్లు–353 నామినేషన్లు సమర్పించారు. ఇక జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 370 మంది అభ్యర్థులు 381 నామినేషన్లు దాఖలు చేశారు.

టీఆర్‌ఎస్‌–157, కాంగ్రెస్‌–126, బీజేపీ–41, టీడీపీ–10, సీపీఐ, సీపీఎం చెరో 5, ఇండిపెండెంట్లు–32, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపుపొందిన, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద రిజిస్టర్‌ అయిన పార్టీ లు–5 నామినేషన్లు వేశాయి. ఈ నెల 28న సాయంత్రం 5కి రెండో దశ ఎన్నికల నామినేషన్ల సమర్పణ గడువు ముగియనుంది. సోమవారం సాయంత్రం 5 వరకు నామినేషన్ల పరిశీలన, 5 గంటల తర్వాత చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబి తా ప్రచురణ, 30న సాయంత్రం 5 వరకు తిర స్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లకు అవకా శం ఇస్తారు. మే 1న సాయంత్రం 5లోపు అప్పీళ్లను పరిష్కరిస్తారు. 2న సాయంత్రం 3లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించా రు. అదేరోజు 3 గంటల తర్వాత పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రచురిస్తారు. మే 10న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. 27న ఉదయం 8 నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement