ట్రిపుల్‌ఐటీలో ముగిసిన వైజ్ఞానిక మేళా | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ఐటీలో ముగిసిన వైజ్ఞానిక మేళా

Published Fri, Mar 23 2018 2:13 PM

Science Fair Was Conducted In Basara IIT - Sakshi

బాసర(ముథోల్‌) : బాసర ట్రిపుల్‌ఐటీలో గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న వైజ్ఞానిక మేళా గురువారం రాత్రి ముగిసింది. దాదాపు 221 మందికి పైగా విద్యార్థులు వివిధ ప్రయోగాలను ప్రదర్శించారు. గురువారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ముగింపు సమావేశానికి ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దివ్య దేవరాజన్, తెలంగాణ యూనివర్సిటీ సాంబయ్య, ఎ¯Œఆర్‌ఎస్‌ఏ డైరెక్టర్‌ సూజాత గోశ్, పాలమూరు యూనివర్శిటీ వైస్‌ ఛాన్సులార్‌ రాజరత్నం, వీసీ డాక్టర్‌ అశోక్‌కుమార్, ముఖ్య అథితులుగా హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను ఆకస్తిగా తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ట్రిపుల్‌ఐటీ ఉండడం అదృష్టమన్నారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న వైజ్ఞానిక దృష్టి కోణాన్ని బహిర్గతం చేయడానికి విజ్ఞాన ప్రదర్శన ఉపయోగపడిందన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏవో వెంకటస్వామి, అకాడమిక్‌ డీన్‌ రణదీర్‌ సాగీ, టెక్‌ ఫెస్టు కన్వీనర్‌ స్వప్నిల్, నాగరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement