స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల ఫలితాలు విడుదల | School Assistant posts results are released | Sakshi
Sakshi News home page

స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల ఫలితాలు విడుదల

Jun 9 2018 12:50 AM | Updated on Sep 15 2018 5:09 PM

School Assistant posts results are released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల ఫలితాలను టీఎస్‌పీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. అభ్యర్థికి వచ్చిన మార్కుల వివరాలతోపాటు మెరిట్‌ ఆధారంగా వారికి రాష్ట్ర ర్యాంకులను కేటాయించింది. పోస్టుల భర్తీలో పారదర్శకతతో పాటు జిల్లాలోని 20 శాతం ఓపెన్‌ కేటగిరీ పోస్టులకు అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పించడంతో ఈ ర్యాంకులను ప్రకటించింది.

1941 స్కూల్‌ ఆసిస్టెంట్‌ పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా అభ్యర్థికి వచ్చిన రాష్ట్ర ర్యాంకు, హాల్‌టికెట్‌ నంబరు, మార్కులు, రిజర్వేషన్‌ కేటగిరీ, జిల్లా వివరాలతో ఫలితాలను ప్రకటించింది. మొత్తం 27 సబ్జెక్టులకు 1,17,410 మందితో మెరిట్‌ జాబితాను రూపొందించింది టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గతంలో ఫలితాలను వెల్లడించిన అనంతరం ఒక పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచేది. ఆ తర్వాత రోస్టర్‌ వారీగా మెరిట్‌ అభ్యర్థులను ఎంపిక చేసేది. తుది ఎంపిక జాబితా ప్రకటించిన తర్వాతే అభ్యర్థి మార్కులు తెలుసుకునే అవకాశం ఉండేది.

కానీ ఇప్పుడు మార్కులను ముందు గానే ప్రకటించడం ద్వారా అభ్యర్థుల్లో ఎలాంటి అనుమా నాలకు తావులేకుండా చర్యలు చేపట్టింది. ఇకపై అన్ని పోస్టులకు ఇదే విధానాన్ని అమలు చేయనుంది. ప్రస్తుతం జారీ చేసిన ర్యాంకుల జాబితాల నుంచి ఒక్కో పోస్టుకు 1:3 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలను సిద్ధం చేసి ఆయా జిల్లాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పంపించనుంది. వెరిఫికేషన్‌ పూర్తయ్యాక జిల్లాల నుంచి వచ్చిన జాబితా లను బట్టి అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనుంది. మరోవైపు సెకండరీ గ్రేడ్‌ టీచర్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్, పండిట్‌ పోస్టులకు సంబంధించిన ర్యాంకులను కూడా త్వరలోనే ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement