ఎనిమిది మంది డీఎస్సీడీవోలకు అవార్డులు 

SC Development Department in several districts Awards - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీల అభివృద్ధి కోసం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్న ఎస్సీ అభివృద్ధి శాఖకు పలు జిల్లాల్లో పురస్కారాలు దక్కాయి. వసతిగృహ విద్యార్థులకు క్రీడోత్సవాలు, విజ్ఞాన విహార యాత్రలు, డబుల్‌ బెడ్‌లు, దుప్పట్ల పంపిణీ, సకాలంలో ఉపకారవేతనాల పంపిణీ తదితర కార్యక్రమాలను నిర్ణీత సమయంలో సాధించినందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం వారు ఆయా జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. వీరిలో నల్లగొండ, నాగర్‌కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మహబూబాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, మెదక్‌ జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారులు (డీఎస్సీడీవో) ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు పి.కరుణాకర్‌ వారిని అభినందించారు. రానున్న రోజుల్లో మరింత స్ఫూర్తిగా పనిచేసి ఇతర అధికారులకు ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top