నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం | savere accident in city | Sakshi
Sakshi News home page

నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం

Apr 14 2017 8:16 AM | Updated on Sep 5 2017 8:46 AM

కార్ఖానా ప్రాంతంలో గురువారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడగా ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.

హైదరాబాద్‌: కార్ఖానా ప్రాంతంలో గురువారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడగా ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. లాలాపేటకు చెందిన ఎండీ అజార్‌(37), ఇమ్రానాబేగం(35) దంపతులతో పాటు ముగ్గురు పిల్లలు ఓ కార్యక్రమానికి హాజరై బైక్‌పై ఇంటికి బయల్దేరారు.
 
వాహనం ఆర్‌టీఏ కార్యాలయం వద్ద మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వచ్చిన జీహెచ్‌ఎంసీ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆజార్‌(37), అమన్‌(9), అశ్వియా(7), అలీనా(3) అక్కడికక్కడే చనిపోయారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వాహన డ్రైవరు మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా, ఆర్మూర్‌ నుంచి వస్తున్న మంత్రి కేటీఆర్‌ ఘటనా స్థలం వద్ద ఆగి, తన కాన్వాయ్‌లోని ఒక వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబానికి అక్కడికక్కడే రూ.5 లక్షల పరిహారం మంత్రి ప్రకటించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement