సారా అమ్మినా.. తాగినా జరిమానే! | Sakshi
Sakshi News home page

సారా అమ్మినా.. తాగినా జరిమానే!

Published Mon, Oct 13 2014 12:55 AM

సారా అమ్మినా.. తాగినా జరిమానే! - Sakshi

పెద్దేముల్: సారా మహమ్మారిని తరిమికొట్టేందుకు యువకులు నడుం బిగించారు. సారా అమ్మినా.. తాగినా.. జరిమానా తప్పదంటూ హెచ్చరించారు. ఈ సంఘటన ఆదివారం పెద్దేముల్ తండాలో చోటుచేసుకుంది. సారా తాగడంతో తండావాసులు అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో సారా మహమ్మారిని తరిమివేద్దామని యువకులు ముందుకు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 11 వరకు గ్రామంలో విక్రయించేందుకు తెచ్చిన సారాను ధ్వంసం చేశారు.

సారా తాగినా.. అ మ్మినా రూ. 10-50 వేల వరకు జరిమానా విధిస్తామని గ్రామస్తులను హెచ్చరించారు. సారా మహ మ్మారి బారినపడితే అనారోగ్యం పాలవుతారని, ఇల్లు గుల్లవుతుందని ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. దీంతో పాటు గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో ఉన్న సారా బట్టీలను ధ్వంసం చేశారు. అనంతరం యువకులు రవినాయ క్, రామునాయక్, చందర్‌నాయకర్, లచ్యానాయక్, తార్యానాయక్,లక్ష్మణ్‌నాయక్, విఠల్, హీరాసింగ్ తదితరులు  సివిల్ పోలీసులతో పాటు ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement