ఇసుక అక్రమ రవాణా వాహనాల సీజ్ | sand transportation vehicles seized in palamuru district | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణా వాహనాల సీజ్

Nov 13 2015 2:33 PM | Updated on Mar 22 2019 2:57 PM

పాలమూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను రెవెన్యూ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు.

మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను రెవెన్యూ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. పేబ్బేరు మండలంలోని వై శాఖాపూర్ గ్రామంలోని కృష్ణా తీరం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది.

దీంతో తహశీల్దార్ బాణప్ప ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి అనుమతుల్లేకుండా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు, ఒక డీసీఎం వాహనాన్ని సీజ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement