కల్వకుంట్ల గబ్బుకు కాంగ్రెస్సే సబ్బు: సంపత్‌ | sampath kumar fired on trs party and name of kalvakuntla | Sakshi
Sakshi News home page

కల్వకుంట్ల గబ్బుకు కాంగ్రెస్సే సబ్బు: సంపత్‌

Apr 5 2017 6:39 AM | Updated on Mar 18 2019 9:02 PM

కల్వకుంట్ల గబ్బుకు కాంగ్రెస్సే సబ్బు: సంపత్‌ - Sakshi

కల్వకుంట్ల గబ్బుకు కాంగ్రెస్సే సబ్బు: సంపత్‌

తెలంగాణకు పట్టిన కల్వకుంట్ల గబ్బును 2019లో కాంగ్రెస్‌ అనే సబ్బుతో కడుగుతామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ చెప్పారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు పట్టిన కల్వకుంట్ల గబ్బును 2019లో కాంగ్రెస్‌ అనే సబ్బుతో కడుగుతామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ చెప్పారు. మంగళవారం ఇక్కడ ఆయ న మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎవరెవరిని బ్లాక్‌మెయిల్‌ చేసి, ఎన్ని డబ్బులు గుంజారనేదానిపై కేటీఆర్‌ బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతమన్న కేటీఆర్‌ మాటలు అహంకారపూరితమని, అధికారం శాశ్వతం అనుకుని కళ్లు నెత్తికెక్కించుకుని ఆయన మాట్లాడుతున్నారన్నారు.

టీఆర్‌ఎస్‌ అధికారం, కేసీఆర్‌ కు సీఎం, కేటీఆర్‌కు మంత్రి పదవి కాంగ్రెస్‌ భిక్ష అనే విషయం మరిచిపోవద్దన్నారు. అమెరికాలో రూ.4లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదు లుకుని ఇప్పుడు రూ.4వేల కోట్లు సంపాదించిన చరిత్ర కేటీఆర్‌దన్నారు. అదుర్స్‌ సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించి, పెద్దమొత్తంలో సొమ్ము ముట్టాక ఊరుకున్నారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement