ఆర్టీఏ కార్యాలయానికి సమంత | Samantha came to rta office | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ కార్యాలయానికి సమంత

Sep 10 2015 1:58 AM | Updated on Sep 3 2017 9:04 AM

ఆర్టీఏ కార్యాలయానికి సమంత

ఆర్టీఏ కార్యాలయానికి సమంత

సినీనటి సమంత బుధవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా కొనుగోలు చేసిన ....

కొత్త కారు రిజిస్ట్రేషన్‌కు వచ్చిన కథానాయిక

హైదరాబాద్: సినీనటి సమంత బుధవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారు రిజిస్ట్రేషన్ కోసం స్వయంగా విచ్చేశారు. రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగారు. డిజిటల్ ప్యాడ్‌పై సంతకం చేశారు.

ప్రాంతీయ రవాణా అధికారి జీపీఎన్  ప్రసాద్ ‘టీఎస్ 09 ఈహెచ్ 3888’ నంబర్‌ను కేటాయిస్తూ కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించారు. హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్, ఆర్టీఓలు, ఉద్యోగులు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆమెతో కలసి ఫొటో దిగేందుకు పోటీపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement