ఎన్నికల్లో లబ్ధి కోసమే ఎకరానికి రూ.4వేలు

Rs 4,000 Acre For Auction In The Next Election - Sakshi

మిషన్‌ భగీరథలో అక్రమాలు

రోడ్ల నిర్మాణంలోనూ అవినీతి

డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి

నిర్మల్‌అర్బన్‌ : ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ.4వేలు ప్రకటించిందని ఉమ్మడి ఆదిలాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. మిషన్‌ భగీరథ పనులు అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారాయని, జిల్లాలో మిషన్‌ భగీరథ పనులు కమిషన్‌ భగీరథగా మారాయని విమర్శించారు. దిలావార్‌పూర్‌ మండలంలో చోటుచేసుకున్న పైప్‌లైన్‌ లీకేజీయే దీనికి నిదర్శనమన్నారు. ట్రయల్‌ రన్‌లో ఎక్కడ పడితే అక్కడ లీకేజీలు బయటపడుతుండడంతో పనులు ఎలా చేపట్టారో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో చేపడుతున్న రహదారి విస్తరణ పనుల్లోనూ అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. మంత్రి కుటుంబీకులే పనులు చేపడుతుండటంతో అధికారులు నోరుమెదపడం లేదని ఆరోపించారు. మంత్రి వైఫల్యంతోనే నిర్మల్‌లో అల్లర్లు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. మిషన్‌ భగీరథ, రోడ్ల విస్తరణ పనుల్లో చోటుచేసుకున్న అవినీతి, నిర్మల్‌లో అల్లర్లకు మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు అయిర నారాయణరెడ్డి, పోశెట్టి, రమణారెడ్డి, తదితరులున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top