వస్త్ర దుకాణంలో చోరీ | Robbery in Clothes showroom | Sakshi
Sakshi News home page

వస్త్ర దుకాణంలో చోరీ

Dec 20 2015 6:19 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఓ వస్త్ర దుకాణంలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది.

చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : ఓ వస్త్ర దుకాణంలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. లక్ష రూపాయల విలువైన చీరలతోపాటు రూ.3.70 లక్షల నగదును ఎత్తుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జీఎం కాలనీకి చెందిన యూనుస్ అహ్మద్ బండ్లగూడ హషమాబాద్ ప్రాంతంలో జిక్రా కలెక్షన్స్ పేరుతో ఓ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం షట్టర్ పైకి లేపి ఉండడాన్ని పాల వ్యాపారి గమనించి అతనికి సమాచారం అందించాడు. వెంటనే బాధితుడు అక్కడికి చేరుకొని చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement