రేవంత్‌రెడ్డి వేగం.. హెలికాప్టర్‌తో ప్రచారం | Revanth Reddy Election Campaign Rangareddy | Sakshi
Sakshi News home page

వంద నియోజకవర్గాల్లో పర్యటిస్తా: రేవంత్‌ రెడ్డి

Nov 26 2018 9:21 AM | Updated on Nov 26 2018 3:44 PM

Revanth Reddy Election Campaign Rangareddy - Sakshi

ప్రచారానికి బయలుదేరుతున్న రేవంత్‌రెడ్డి

కొడంగల్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవలంబిస్తున్న కుట్రలు, కుతంత్రాలకు తెరదించుతూ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. కోస్గి, దౌల్తాబాద్, మద్దూరు మండలాలకు చెందిన పలువురు టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తనకు వంద నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యత అప్పగిందని చెప్పారు.

ఇందుకోసం హెలికాప్టర్‌ వసతి కల్పించారని తెలిపారు. కేసీఆర్‌ను అధికారంలోకి తెచ్చుకోవడానికి అడ్డదారిలో పయనిస్తున్న వారి వివరాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం కొనసాగిస్తానన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో చెరగని ముద్రలా ఉన్నాయన్నారు. అనంతరం ఆయన ప్రచారం నిమిత్తం హెలికాప్టర్‌లో ఆసిఫాబాద్‌కు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement